హైదరాబాద్: తెలుగుదేశంసీనియర్ నాయకుడు తులసీరాం పార్టీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక సందర్భంగా తనసీనియారిటీని, సేవలను గుర్తించకపోవడాన్ని నిరసిస్తూ ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
గురువారంనాడే ఆయన తన రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు పంపించినట్లు సమాచారం. మూడు సార్లు పార్లమెంటు సభ్యుడిగా, అఖిల భారత స్థాయిలో అధికార భాషా సంఘం చైర్మన్‌గా, జాతీయ సఫాయి కర్మచారుల సంఘం నేతగా వివిధ స్థాయిల్లో పదవీబాధ్యతలు నిర్వహించిన ఆయన ఆదినుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేతగా ఎన్.టి. రామారావు ఉన్నప్పుడు కూడా ఆయన పార్టీ ఉపాధ్యక్షులుగా వున్నారు. ప్రస్తుత రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక సందర్భంగా ఒక దశలో తులసీరాంపేరును కూడా పరిశీలించింది. తుది కూర్పులో ఆయనకు అవకాశం లభించలేదు.