రామాలయ నిర్మాణం ఈ ఏడాదే ప్రారంభం

అయోధ్యః అయోధ్యలో రామాలయ నిర్మాణం ఈ ఏడాదే ప్రారంభమవుతుందని రామజన్మభూమి న్యాస్‌ అధ్యక్షుడు మహంత్‌ పరమహంస రామచంద్ర దాస్‌ చెప్పారు.

2007 నాటికి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు. శిలాదాన్‌ శాంతియుతంగా జరగడం తనకెంతో ఆనందంగా వుందని ఆయన చెప్పారు.స్వాధీనం చేసుకున్న స్థలాన్ని ప్రభుత్వం తమకుఅప్పగించగలదనే విశ్వాసం ఆయన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మర్యాదగా స్థలాన్ని అప్పగించకపోతే బలవంతంగా స్థలాన్ని తీసుకోవడానికి వెనకాడమని ఆయన చెప్పారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే అయోధ్య సమస్య తప్పకుండా పరిష్కారం అవుతుందని ఆయన చెప్పారు. అయితే సమస్య పరిష్కారానికి ప్రధానికి అనేక అవరోధాలు వున్నాయని అన్ని వత్తిళ్లు తట్టుకుని ఆయన ముందుకు కదలడం కష్టమని పరమహంస అన్నారు. సమస్య పరిష్కారం కోసంవిజ్ఞులైన ముస్లింలతో మాట్లాడేందుకు తనకు ఎటువంటి అభ్యంతరం లేదని ఆయన అన్నారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+