నటాషా కేసులో మరో పోస్ట్‌మార్టం

హైదరాబాద్‌ః నక్సల్స్‌తో చర్చల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్దిపై హైదరాబాద్‌లో సోమవారం నాడు జరిగిన ఒక సదస్సు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేసింది. త్రివేండ్రంలో జరుగుతున్న సిపిఐ 18వ మహాసభలను పురస్కరించుకుని నక్సల్స్‌తో చర్చలు అనే అంశంపై సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పౌరస్పందన వేదిక కన్వీనర్‌ శంకరన్‌, ప్రొఫెసర్‌ హరగోపాల్‌, పిసిసి నేత సత్యనారాయణరావు, సిపిఐ నేత సురవరం సుధాకర్‌రెడ్డి తదితరులు ఈ సదస్సులో ప్రసంగించారు. వరంగల్‌ ఎన్‌కౌంటర్‌ చర్చల వాతావరణాన్ని ధ్వంసం చేసిందని వక్తలు అభిప్రాయపడ్డారు. నక్సల్స్‌ సమస్య పేరుతో విశృంఖలమైన అధికారాలను అనుభవిస్తున్న పోలీసులే చర్చలకు సైంధవుల్లా అడ్డుపడుతున్నారని పిసిసి నేత సత్యనారాయణరావు అనుమానం వ్యక్తం చేశారు. ఈ రోజు పోలీసులు అనుభవిస్తున్న అధికారులను చూస్తే తనను, వేదికపై వున్న పొత్తూరిని, సుధాకర్‌రెడ్డి ఎవరినైనా సరే నక్సల్స్‌ పేరుతో ఎన్‌కౌంటర్‌ చేసినా అడిగే దిక్కులేదని ఆయన తీవ్రంగా విమర్శించారు.

పోలీసులే సమస్య పరిష్కారంగా ప్రభుత్వం భావించరాదని పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణ యంత్రాంగం మాత్రమేనని హరగోపాల్‌ అభిప్రాయపడ్డారు. పొత్తూరి మాట్లాడుతూ, చర్చలకు అనుకూలమైన వాతావరణం ఇంకా వున్నదనివిశ్వాసం వ్యక్తం చేశారు. చర్చలకు విఘ్నం కలిగించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను గ్రహించి నక్సల్స్‌ జాగ్రత్త వహించాలని ఎన్‌కౌంటర్ల వల్ల చర్చలకు దూరం జరిగితే ప్రభుత్వం ఉచ్చులో నక్సల్స్‌ ఇరుక్కున్నట్టేనని సురవరం సుధారకర్‌రెడ్డిపేర్కొన్నారు.ఎంతో శ్రమపడి చర్చలకు అనుకూలమైన వాతావరణాన్ని తాము తీసుకువస్తే వరంగల్‌ ఎన్‌కౌంటర్‌ వల్ల పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చిందని పౌరస్పందన వేదిక కన్వీనర్‌ శంకరన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చర్చల పట్ల చిత్త శుద్దిగా వుంటే ఈ విషయంలో చొరవ తీసుకోవాలని ఆయన సూచించారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+