నక్సల్స్‌తో చర్చలకు పోలీసు విఘ్నాలు
హైదరాబాద్‌ః నక్సల్స్‌తో చర్చల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్దిపై హైదరాబాద్‌లో సోమవారం నాడు జరిగిన ఒక సదస్సు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేసింది. త్రివేండ్రంలో జరుగుతున్న సిపిఐ 18వ మహాసభలను పురస్కరించుకుని నక్సల్స్‌తో చర్చలు అనే అంశంపై సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పౌరస్పందన వేదిక కన్వీనర్ శంకరన్, ప్రొఫెసర్ హరగోపాల్, పిసిసి నేత సత్యనారాయణరావు, సిపిఐ నేత సురవరం సుధాకర్‌రెడ్డి తదితరులు ఈ సదస్సులో ప్రసంగించారు. వరంగల్ ఎన్‌కౌంటర్ చర్చల వాతావరణాన్ని ధ్వంసం చేసిందని వక్తలు అభిప్రాయపడ్డారు. నక్సల్స్ సమస్య పేరుతో విశృంఖలమైన అధికారాలను అనుభవిస్తున్న పోలీసులే చర్చలకు సైంధవుల్లా అడ్డుపడుతున్నారని పిసిసి నేత సత్యనారాయణరావు అనుమానం వ్యక్తం చేశారు. ఈ రోజు పోలీసులు అనుభవిస్తున్న అధికారులను చూస్తే తనను, వేదికపై వున్న పొత్తూరిని, సుధాకర్‌రెడ్డి ఎవరినైనా సరే నక్సల్స్ పేరుతో ఎన్‌కౌంటర్ చేసినా అడిగే దిక్కులేదని ఆయన తీవ్రంగా విమర్శించారు.












Click it and Unblock the Notifications
