శ్రీనగర్: బారాముల్లాలోని ఒక గ్రామంలోమిలిటెంట్ల ఆధీనంలో ఉన్న మసీదును భారత భద్రతా బలగాలుస్వాధీనం చేసుకున్నాయి. మసీదులో ఉన్న ఇద్దరుమిలిటెంట్లు భద్రతా బలగాల చేతుల్లో హతమయ్యారు. దీంతో మసీదు భద్రతా బలగాలస్వాధీనంలోకి వచ్చింది.
పరాయి దేశానికి చెందినట్లు భావిస్తున్నట్లు ఈ ఇద్దరుమిలిటెంట్లు మసీదులో 14 గంటల పాటు తల దాచుకున్నారు. లొంగిపోవడానికిమిలిటెంట్లు నిరాకరించారు. మిలిటెంట్లకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరుమిలిటెంట్లు మరణించారు.