పాక్ మత ఉద్రిక్తతలు రేపుతోంది: అద్వానీ
గుర్గావ్: ప్రచ్ఛన్న యుద్ధంవిషయంలో అంతర్జాతీయంగా ఏకాకి అయిన తర్వాత పాకిస్థాన్ భారత్‌లో మత ఉద్రిక్తతలను ప్రోత్సహిస్తోందని హోం మంత్రి ఎల్.కె. అద్వానీవిమర్శించారు. పొటోను ఆయన సమర్థిస్తూ తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి అటువంటి ప్రత్యేక చట్టాలు అవసరమని అన్నారు.సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) అధికారుల, జవాన్లనుద్దేశించి ఆయన శనివారం ప్రసంగించారు.
తీవ్రవాదం విషయంలో పాకిస్థాన్ వైఖరి మారే సూచనలు కనిపించడం లేదని, తమ డిమాండ్లను నెరవేర్చిన తర్వాతనే పాకిస్థాన్ పట్ల భారత్ వైఖరి మారతుందని అద్వానీ
చెప్పారు.
భారత్ కోరిన 20 మంది తీవ్రవాదులను అప్పగించాలని అమెరికా పాకిస్థాన్‌కు సూచించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications
