ప్రైవేటీకరణపైఅసెంబ్లీలో రగడ
హైదరాబాద్: సహకార స్పిన్నింగ్, పంచదారమిల్లుల ప్రయివేటీకరణ ప్రతిపాదనలపై శనివారం శాసనసభలో తీవ్ర రగడ చెలరేగింది. ఈమిల్లుల ప్రయివేటీకరణకు దారి తీసిన పరిస్థితులపైవిచారణ జరపడానికి సభా సంఘం వేయాలని ప్రతిపక్షాలు చేసిన డిమాండ్‌ను ప్రభుత్వం త్రోసి పుచ్చింది. పునరుద్ధరణకువీలు లేని మిల్లులను ప్రయివేట్ పరం చేయడం తప్ప మార్గం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
పునరుద్ధరణకు వీలు కాని మిల్లులను ప్రయివేట్‌పరం చేస్తామని, వీలయ్యే వాటిని నడిపిస్తామని, ఉద్యోగులకుస్వచ్ఛంద పదవీ విమరణ పథకాన్ని అమలు చేస్తామని, కొంత మందిని ఇతర శాఖల్లో నియమిస్తామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు.
ప్రభుత్వం సభా సంఘానికి అంగీకరించనందుకు నిరసనగా సిపిఎం సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. మంత్రి ప్రకటనకు సంతృప్తి చెందని కాంగ్రెస్ సభ్యులుస్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. దీంతో డిప్యూటీస్పీకర్ హరీశ్వర్ రెడ్డి సభను వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications
