బాబుతో రాజకీయ చర్చలు: బుద్ధదేవ్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడితో రాజకీయాలు చర్చించానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య అన్నారు. ఇద్దరు రాజకీయ నాయకులు కలిసినప్పుడు రాజకీయాల గురించి చర్చించుకోవడం సహజమని, చర్చలవివరాలను పత్రికలకు వెల్లడించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఎదుర్కుంటున్న ఉమ్మడి సమస్యలపై మాట్లాడుకున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఆర్థిక, వ్యవసాయ రంగాల్లో ఇరు రాష్ట్రాలకు మధ్యస్వామ్యం వుందని, ఈ విషయాలపై తమ మధ్య చర్చ జరిగిందని ఆయన అన్నారు. ఇరు రాష్ట్రాలకు ఎదుర్కుంటున్న తీవ్రవాద సమస్యపై తాను చంద్రబాబుతో చర్చించానని త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ చెప్పారు.












Click it and Unblock the Notifications
