భారత్‌ దుస్సాహసానికి జవాబు:పర్వేజ్‌

ఇస్లామాబాద్‌: భారత్‌ దుస్సాహసానికి పాల్పడితే తమ దేశం తగిన గుణపాఠం చెబుతుందని పాకిస్థాన్‌ అధ్యక్షుడుపర్వేజ్‌ ముషారఫ్‌ అన్నారు. ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి తమసైనిక బలగాలు పూర్తి సంసిద్ధతతో ఉన్నాయని ఆయన అన్నారు.

నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి భారత్‌ తన బలగాలనుపెద్ద యెత్తున మోహరించిందని, భారత్‌ పద్ధతి దూకుడుగా వున్నదని, వారికి తప్పుడు అభిప్రాయం వుండకూడదని, తమ దేశానికి సవాల్‌ విసిరితే తగిన గుణపాఠం చెప్పగలమని ఆయన అన్నారు.

పాకిస్థాన్‌ బలమైన దేశమని, ఎదుర్కోగల సత్తా తమకు ఉన్నదని ఆయన అన్నారు. తమ బలగాలు దేశ సరిహద్దు వెంబడి ఉన్నందున సంప్రదాయ బద్ధంగా జరగాల్సినసైనిక విన్యాసం శనివారం జరగలేదని ఆయన చెప్పారు.

తమ దేశం దక్షిణాసియాలో శాంతిని కోరుకుంటున్నదని, తాము న్యూఢిల్లీతో కాశ్మీర్‌అంశంతో పాటు అన్ని అంశాలపై చర్చలకు సిద్ధంగా వున్నామని ఆయన చెప్పారు. తీవ్రవాద సమస్యను తుద ముట్టించడానికి తాము అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, నిఘా సామర్థ్యంపెంచాల్సిన అవసరం ఉన్నదని, ఆధునిక పరిశోధన పద్ధతులను అవలంభించాల్సి వున్నదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+