ఇస్లామాబాద్‌ః భారత్ కోరిన 20 మంది టెర్రరిస్టులను అప్పగించేందుకు పాకిస్తాన్ తిరస్కరించింది. ఈ 20 మందికి వ్యతిరేకంగా సరైన సాక్ష్యాలను భారత్ చూపించలేకపోయిందని పాకిస్తాన్ పేర్కొంది.
భారత్‌లో తీవ్రవాద కార్యకలాపాలతో సంబంధం వున్న 20 మంది ప్రస్తుతం పాకిస్తాన్‌లో తలదాచుకున్నారని వారిని తమకుఅప్పగించాలని భారత్ చాలా రోజుల నుంచి కోరుతున్నవిషయం విదితమే. తాజాగా అమెరికా కూడా భారత్ కోరుతున్న టెర్రరిస్టులనుఅప్పగించాల్సిందిగా పాకిస్తాన్‌కు హితం చెప్పింది. అయితే ఈఇరవై మందికి వ్యతిరేకంగా భారత్ తగిన సాక్ష్యాలు చూపలేకపోయిందని సాక్ష్యాలు చూపిస్తే వారిపై పాకిస్తాన్‌లో చట్టప్రకారంవిచారణ జరిపిస్తామని పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధిపేర్కొన్నారు. తమ వైఖరిని అమెరికాకు కూడా తెలియజేసినట్టు ఆయన చెప్పారు.