పొటో ఆమోదం తథ్యం: ప్రధాని
న్యూఢిల్లీ: ప్రభుత్వానికి తగినంత మెజారిటీ ఉందని, ఈ నెల 26వ తేదీన సంయుక్త పార్లమెంరీ సమావేశంలో తీవ్రవాద నిరోధక బిల్లు(పొటో) ఆమోదం పొందుతుందనే విశ్వాసం తనకు ఉన్నదని ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి అన్నారు.
ఇదిలా వుంటే, ఐదుగురు పార్లమెంటు సభ్యులతో కొత్తగా ఏర్పడిన ఇండియన్ ఫెడరల్ డెమొక్రటిక్ పార్టీ ఎన్‌డిఎ సంకీర్ణంలో చేరింది. ఈ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతపి.సి. థామస్ శుక్రవారంనాటి ఎన్‌డిఎ సమావేశానికిహాజరయ్యారు. దేశం పలు ఎదుర్కుంటున్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వాన్ని పటిష్టం చేయడానికి ఎన్‌డిఎలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఆయన చెప్పారు.
ఈ కొత్త పార్టీలో పప్పు యాదవ్, మోహన్ దేల్కర్, అన్వరుల్ హక్, సుఖదేవ్‌పశ్వాన్ ఉన్నారు. హక్, పశ్వాన్ రాష్ట్రీయ జనతా దళ్ (డెమొక్రటిక్) సభ్యులుకాగా, థామస్, యాదవ్, దేల్కర్ ఇండిపెండెంట్స్.












Click it and Unblock the Notifications
