హైదరాబాద్: చర్చలు ముందుకు సాగాలంటే కాల్పులవిరమణకు కట్టుబడి వుండాలని పౌర స్పందన వేదికపీపుల్స్‌వార్‌కు సూచించింది. ప్రభుత్వం కూడా ఎన్‌కౌంటర్లను, కూంబింగ్ ఆపరేషన్లను ఆపేయాలని ఆయన శనివారం అన్నారు.
పీపుల్స్‌వార్‌కు, ప్రభుత్వానికి మధ్య చర్చలకు అనుకూల వాతావరణం ఏర్పరచడానికి పౌర స్పందన వేదిక చాలా కాలంగా కృషి చేస్తున్నవిషయం తెలిసిందే. అవసరమైతే తాము పీపుల్స్‌వార్‌కు, ప్రభుత్వానికి మధ్య సంధానకర్తలుగా వ్యవహిరిస్తామని పౌర స్పందన వేదిక కన్వీనర్ ఎస్.ఆర్. శంకరన్ చెప్పారు. చర్చల ప్రక్రియ ఒక కొలిక్కివచ్చేదాకా తాము సంధానకర్తలుగా వ్యవహరించడానికి సిద్ధమేనని ఆయన అన్నారు. చర్చలకు అనుకూల వాతావరణం ఏర్పడడానికి ప్రభుత్వం కృషి చేయాలని ఆయన సూచించారు.