అమెరికా దౌత్య కార్యాలయం మూత
ఇస్లామాబాద్‌ః పాకిస్తాన్‌లోని తమ దౌత్య కార్యాలయాన్ని, వివిధ నగరాల్లో వున్న కాన్సూలెట్ కార్యాలయాలను మూడురోజుల పాటు మూసివేయాలని అమెరికా నిర్ణయించింది. అంతే కాకుండా పాకిస్తాన్‌లోని దౌత్య ఉద్యోగుల్లో అనేక మందిని వెనక్కి పిలిపిస్తూ కూడా అమెరికా ఉత్తర్వులు జారీ చేసింది.
ముషారఫ్ తీసుకుంటున్న చర్యలపై తమకు పూర్తిగావిశ్వాసం వున్నదని అయితే ముందుజాగ్రత్తగా తాము కొంతమంది సిబ్బందిని తగ్గించాలని నిర్ణయించామని అమెరికావివరించింది. అమెరికా చర్య అంతర్జాతీయ సమాజంలో ముషారఫ్ ప్రతిష్టను దారుణంగా దెబ్బతీసే అవకాశం వున్నదనిఅంటున్నారు.












Click it and Unblock the Notifications
