మెదక్: మెదక్ జిల్లా నంగనూరు మండలంఅక్కినే పల్లి గ్రామం నుంచి కిడ్నాప్‌నకు గురయిన ఇద్దరు బాలికలకువిముక్తి లభించింది. వారిద్దరిని కిడ్నాపర్లు ఆదివారం ఉదయం వదిలిపెట్టారు.
శనివారం సాయంత్రం ఎనిమిది మందితో కూడిన దుండగులుఅక్కినేపల్లి గ్రామంలోని ఒక వ్యాపారి ఇంటిలో చొరబడి దోపిడీ చేయడమే కాకుండా ఆ వ్యాపారి కూతుళ్లుసారిక, బబితలను కిడ్నాప్ చేశారు. వారిని వదిలేందుకు కిడ్నాపర్లు ఐదు లక్షల 20 వేల రూపాయలు డిమాండ్ చేశారు. తాము డిమాండ్ చేసిన డబ్బును కోహెడ క్రాస్ రోడ్ వద్దఅప్పగించాలని వారు వ్యాపారికి తెలియజేశారు. అయితే, ఇద్దరు బాలికలను ఒకరి వెంట ఒకరిని వదిలేశారు.