కాశ్మీర్ పాక్ సొంతం కాదు: వాజ్‌పేయి
సివ్లూ: సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఆపేయాలని ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి పాకిస్థాన్ డిమాండ్ చేశారు. కాశ్మీర్‌పై పాకిస్థాన్ నియంత్రణను అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేశారు.
ముస్లింలు అత్యధికంగా ఉన్న తూర్పు పాకిస్థాన్‌పై నియంత్రణను కాపాడుకోలేని పాకిస్థాన్ ఇప్పుడు కాశ్మీర్‌పై నియంత్రణ గురించి మాట్లాడుతోందని వాజ్‌పేయి అన్నారు. పరిస్థితి మెరుగు కాగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
పార్లమెంటుపై, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీపై దాడులను బట్టి పాకిస్థాన్ భారత్‌తోస్నేహపూర్వకం సంబంధాలను కోరుకోవడం లేదనిఅర్థమవుతోందని ఆయన అన్నారు.
పార్లమెంటుపై దాడిని తిప్పి కొట్టిన భద్రతా బలగాలను ఆయన అభినందిస్తూ తీవ్రవాదులు తమ కుయుక్తిలోవిజయం సాధించి వుంటే మరింత రక్తపాతం జరిగి వుండేదని అన్నారు.
గుజరాత్ సంఘటనలు చాలా బాధాకరమైనవని, దేశంలో అంతర్గత శాంతి, సహోదరత్వం అవసరమని వాజ్‌పేయి అన్నారు. సంఘటనలపైవిచారణకు, అందుకు గల కారణాల అన్వేషణకు విచారణ సంఘాన్ని నియమించినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications
