ఛార్జీలు పెంచనని చెప్పలేదేః బాబు

న్యూఢిల్లీ: ఉగ్రవాద నిరోధక బిల్లు(పొటో) మంగళవారం జరిగిన పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశంలో నెగ్గింది. బిల్లుకు అనుకూలంగా 425 ఓట్లు వచ్చాయి. వ్యతిరేకంగా 296 ఓట్లు వచ్చాయి.

పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశంలో హోం మంత్రి ఎల్‌.కె. అద్వానీ బిల్లును ప్రతిపాదించారు. సీమాంతర ఉగ్రవాదం యుద్ధం లాంటిదని, ఇది శాంతి భద్రతల సమస్య మాత్రమే కాదని ఆయన అన్నారు. ఉగ్రవాదాన్ని నిరోధించడానికి పొటో అవసరమని ఆయ వాదించారు.

బిల్లుపై సమావేశంలో సుదీర్ఘంగా వాడి వేడి చర్చలు జరిగాయి. ప్రతిపక్ష నాయకురాలు సోనియా గాంధీ ప్రధాని వాజ్‌పేయిపై తీవ్రవిమర్శలు చేశారు. ప్రధాని సంఘ్‌ పరివార్‌ ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారని, తన ప్రాథమిక విధులనువిస్మరించిన ప్రధాని రాజీనామా చేయాలని ఆమె అన్నారు.

మైనారిటీ ముస్లింలను భయకంపితులను చేయడానికి ప్రభుత్వం పొటోను తెస్తోందని సిపిఎం నేత సోమనాథ్‌ ఛటర్జీవిమర్శించారు. ఈ వాదనను మాజీ ప్రధాని దేవెగౌడ, సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయం సింగ్‌ యాదవ్‌ బలపరిచారు. కాంగ్రెస్‌ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని న్యాయ శాఖ మంత్రిఅరుణ్‌ జైట్లీ విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+