శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని ఉద్ధంపూర్ జిల్లాలో శుక్రవారం సాయంత్రంమిలిటెంట్లు ఆర్మీ జీపును పేల్చివేశారు. ఈ సంఘటనలో ఇద్దరు జవాన్లు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ దాడి సంగోనిలో జరిగింది. ఆర్మీ జీపు ఛాసనా వైపు వెళ్తుండగా శక్తివంతమైన పేలుడు పదార్థంతో తీవ్రవాదులుపేల్చివేశారు. సంఘటన చేరిన వెంటనే తీవ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలింపు ముమ్మరం చేశారు.