కాశ్మీర్‌లో దాడి: ఇద్దరు జవాన్ల బలి
జమ్మూ: లష్కర్- ఎ- తోయిబా ఆత్మాహుతి దళం శుక్రవారం జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో గల సరిహద్దు భద్రతా దళం శిబిరంపై దాడి చేయడంతో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు.
మరో మిలిటెంట్ల బృందం ముందు గేటు నుంచి శిబిరంలోకి ప్రవేశిస్తూ కాల్పులు జరిపారు. గ్రెనేడ్లువిసిరారు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే మరణించగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
బిఎస్‌ఎఫ్ బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఈ ఎదురు కాల్పులు గంటకుపైగా సాగాయి. ఆ తర్వాత మిలిటెంట్లు ఎత్తు ప్రదేశాల్లోకి పారిపోయారు. సంఘటనా స్థలానికి హుటాహుటిన అదనపు బలగాలు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టాయి.












Click it and Unblock the Notifications
