పాక్‌లో అమెరికాతో కలిసి దాడులు
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై పాకిస్థాన్, అమెరికాలు శుక్రవారంనాడు ఉమ్మడి దాడులు ప్రారంభించాయి. ఈ దాడుల్లో ఇద్దరు ఆల్ ఖయిదా తీవ్రవాదులను హతమార్చారు. యాభై మందికిపైగా అరెస్టయ్యారు. అరెస్టయినవారిలో నిషిద్ధ జైష్-ఎ- మొహమ్మద్, హర్కత్- ఉల్- ముజాహిదీన్ సభ్యులు ఉన్నారు.వీరిని ఫైసలాబాద్, లాహోర్‌లలోని స్థావరాల నుంచిఅరెస్టు చేశారు.
మరణించిన ఇద్దరు అరబ్ జాతీయులు కాగా, అరెస్టయిన 50 మందిలో 42 మందిఅరబ్ జాతీయులు, ఐదుగురు అఎn్ఘాన్లు, కొంత మంది పాకిస్థానీలు. లాహోర్‌లో గురువారం రాత్రి దాడులు చేసి పలువురినిఅరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications
