కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన బాబు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం కాంగ్రెస్‌పై తీవ్రంగా ధ్వజమెత్తారు. తెలుగుదేశం సమన్వయ కమిటీ కన్వీనర్ల, సభ్యుల సమావేశంలో ఆయన కాంగ్రెస్ రాష్ట్ర నేతల తీరుపైవిమర్శనాస్త్రాలు సంధించారు.
ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకుంటున్న కాంగ్రెస్‌కు వచ్చే ఎన్నికల్లో కూడా ప్రజలు బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. జన్మభూమి కార్యక్రమాన్ని కాంగ్రెస్ విమర్శించడాన్ని ఆయన తప్పు పట్టారు. వచ్చే ఎన్నికల్లో జన్మభూమి కార్యక్రమమే తమ ప్రధానాస్త్రమని, దమ్ము వుంటే కాంగ్రెస్ ఎదుర్కోవాలని ఆయన అన్నారు. స్థానిక నాయకత్వం బలహీనపడడంతో కాంగ్రెస్‌లో ఢిల్లీ పెత్తనంపెరిగిందని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications
