సింగపూర్, భారత్‌ల మధ్య ఒప్పందాలు
సింగపూర్: టెలికమ్, సాంస్కృతిక రంగాల్లో సహకారానికి భారత్, సింగపూర్‌లు సోమవారం రెండు అవగాహనా పత్రాలపై సంతకాలు చేశాయి. దీర్ఘకాలిక సహకారానికి అవకాశాలు గల రంగాలను, ముఖ్యంగా వాణిజ్య ప్రోత్సాహంలో గుర్తించడానికి ఒక సంయక్త అధ్యయన గ్రూప్‌ను ఏర్పాటు చేయడానికి రెండు దేశాలుఅంగీకరించాయి.
ఆదివారంనాడిక్కడికి చేరుకున్న ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి ఉగ్రవాద వ్యతిరేక పోరుపై, వాణిజ్య రంగంలో, నాలెడ్జి సంబంధిత పరిశ్రమల్లో సహకారంపై గోహ్‌తో విస్తృతంగా చర్చలు జరిపారు.
ఎయిర్ ఇండియాలో వచ్చే కొద్ది నెలల్లో పెట్టుబడుల ఉపసంహరణకు అవకాశం లేదని అవగాహనా పత్రాలపై సంతకాలు చేసిన అనంతరంఅరుణ్ శౌరి విలేకరులతో చెప్పారు. సింగపూర్ ఎయిర్ లైన్స్‌కు ఇండియన్ ఎయిర్ లైన్స్‌లో 26 శాతం వాటా ఇచ్చే ఒప్పందం కుదరలేదని, ఆ విధంగా భారత్ గొప్ప అవకాశాన్ని కోల్పోయిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
