వాజ్‌పేయికి సుప్రీంకోర్టు నోటీసు
న్యూఢిల్లీ: లక్నో లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి విజయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం ప్రధానికి నోటీసు జారీ చేసింది. ఛీఫ్ జస్టిస్ ఎస్.పి. బరూచా, జస్టిస్ శివరాజ్ వి పాటిల్, జస్టిస్ డి.ఎం. ధర్మాధికారిలతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ ఈ నోటీసు జారీ చేసింది.
లాల్ పటిషన్‌ను జనవరి 17వ తేదీన అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ కొట్టి వేసింది. ఎన్నికల్లో పోటీ చేయనందున పటిషనర్‌కు వాజ్‌పేయి ఎన్నికను సవాల్ చేస్తూ పటిషన్ వేసే అర్హత లేదని, ఈ పటిషన్ ప్రజాప్రాతినిధ్య చట్టం పరిధిలోకి రాదని లక్నో బెంచ్ అభిప్రాయపడింది.
ఆరు వారాల్లోగా సమాధానాన్ని దాఖలు చేయాలని సుప్రీంకోర్టు వాజ్‌పేయిని ఆదేశించింది.












Click it and Unblock the Notifications
