వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుజరాత్‌ సంఘటనలు అవరోధం కావు

By Staff
|
Google Oneindia TeluguNews

సింగపూర్‌: బాధాకరమైన గుజరాత్‌లోని మత ఘర్షణలు భారతదేశంలో విదేశీ పెట్టుబడుల వాతావరణాన్నిదెబ్బ తీయదని భారత ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి అన్నారు. గుజరాత్‌ ఘర్షణలు విదేశీ పెట్టుబడులనుదెబ్బ తీయగలదనే ఆలోచనలను ఆయన ఖండిస్తూసంఘటనలు విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల ఆలోచనల్లో నాటుకుపోయాయి. ఇప్పుడు పరిస్థితి అదుపులో వుంది. ప్రస్తుత వాతావరణం భారతదేశాంలోని వ్యాపార వాతావరణంపై ప్రభావం చూపదు అని అన్నారు.

మూడు రోజుల పర్యటన కోసం వచ్చిన వాజ్‌పేయి సోమవారం ఇక్కడి భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరంవిలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ప్రస్తుతం భారతదేశంలో పెట్టుబడి అవకాశాలు మెరుగ్గా వున్నాయి. పలు రంగాల్లో ఇవి మొదలయ్యాయి. జాప్యాలను తగ్గించి విధానాలను సులభతరం చేసే ప్రయత్నాలు చేస్తున్నాం అని ఆయన చెప్పారు.

గుజరాత్‌ సంఘటనలు బాధాకరమైనవి, విషాదకరమైనవని, ఈ సంఘటనలు ఎందుకు చోటు చేసుకున్నాయనే ఆత్మావలోకనం అవసరమని ఆయన అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మనదని, ప్రజాస్వామ్యం కొన్ని సమస్యలను తెచ్చి పెడుతుందని, వాటిని అధిగమించాల్సి వుంటుందని ఆయన అన్నారు.

అహ్మదాబాద్‌లో ఆదివారం లాఠీ ఛార్జీ జరగడం పట్ల,అందులో కొంత మంది జర్నలిస్టులు గాయపడడం పట్ల వాజ్‌పేయి తీవ్ర ఆక్షేపణ తెలియజేశారు. ఈ సంఘటనపైవిచారణకు ఆదేశించామని, ఒక పోలీసు అధికారిని తొలగించామని ఆయన చెప్పారు. జర్నలిస్టులు మనకు వార్తలుఅందజేస్తారని, కానీ ఈసారి వారే వార్త అయ్యారని ఆయన వ్యాఖ్యానించారు.

వంద కోట్ల మంది ఉన్న దేశంలో చిన్నపాటి సంఘటనలు జరుగుతూనే వుంటాయని, తాము భవిష్యత్తు వైపు దృష్టి సారించి ముందుకు సాగుతున్నామని, ఎప్పటికప్పుడు చిరాకులు ఎదురవుతూనే వుంటాయని, వాటిని తొలగించాల్సి వుంటుందని ప్రధాని అన్నారు.

ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీలో, సంబంధిత రంగాల్లో భారత్‌ ఎంతో ప్రగతి సాధించిందని, కానీ ఇతర రంగాల్లో 21వ శతాబ్ది విసురుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధం కావాల్సే వున్నదని ఆయన భారతీయులనుద్దేశించి చేసిన ప్రసంగంలో అన్నారు. ఆర్థిక విధానాలను కొత్త దిశను నిర్దేశిస్తున్నట్లు ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X