పొటా ప్రయోగంపై జనా కృష్ణమూర్తి
కోల్‌కత్తా: ఉగ్రవాదాన్ని అంతమొందించడంలో కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు సహకరించకపోతే కేంద్రం రాజ్యాంగపరమైన చర్యలు చేపట్టాల్సి వుంటుందని భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడు జనా కృష్ణమూర్తి అన్నారు. మంగళవారం ఢిల్లీకి బయలుదేరే ముందు ఆయన ఇక్కడ కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు.
కేంద్ర, రాష్ట్రాల మధ్య గల రాజ్యాంగపరమైన సంబంధాలతో దేశంలో పాలన సాగుతుందని,సరైన సంబంధాల విషయంలో కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని ఆయన అన్నారు.
కాంగ్రెస్ పొటాకు సవరణలు సూచించి వుండాల్సిందని, అయితే మొత్తంగానే దాన్ని వ్యతిరేకించి సంయుక్త పార్లమెంటరీ సమావేశం ఏర్పాటుకు కారణమైందని ఆయన అన్నారు.
కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల్లో ఉగ్రవాద సంస్థలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తుంటే ఆ ప్రభుత్వాలు పొటాను ప్రయోగించడానికి నిరాకరిస్తే పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం జాతీయ ప్రయోజనాలను ఫణంగాపెట్టవద్దని ఆయన కాంగ్రెస్‌కు, ఇతర ప్రతిపక్షాలకువిజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications
