తీవ్రవాదంపై ఉమ్మడి పోరు: వాజ్‌పేయి
సింగపూర్: తీవ్రవాదాన్ని ఆసియా, పసిఫిక్ దేశాలు ఉమ్మడిగా ఎదుర్కోవాల్సిన సమయం వచ్చిందని భారత ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి అన్నారు. ఈ ప్రాంత భద్రతా సమస్యల పరిష్కారంలో భాగం పంచుకోవడానికి భారత్ కట్టుబడి వున్నదని ఆయన చెప్పారు.
అధికారాన్ని గౌరవించని, లక్ష్య పెట్టని తీవ్రవాదాన్ని మనం వ్యతిరేకించాల్సి ఉన్నదని, క్రమశిక్షణతో కూడిన సింగపూర్ సమాజం కూడా ఇటీవల ఈ సమస్యను ఎదుర్కుంటోందని ఆయన అన్నారు.
అనుభవాలను, సమాచారాన్ని, ఇంటలిజెన్స్‌ను పరస్పరం పంచుకోవడం ద్వారా తీవ్రవాద సమస్యను ఎదుర్కోవడం అవసరమని ఆయన అన్నారు. ఇండోనేషియా, మలేషియా, పిలిప్పైన్స్, థాయ్‌లాండ్‌లలో పని చేస్తున్న మత ఛాందస సంస్థ జెమా ఇస్లామియా కార్యకలాపాలతో సింగపూర్ కూడా ఇబ్బంది పడుతోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
