హైదరాబాద్‌ః రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో వెలసిన ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫాకల్టీ కొరత వున్న కారణంగా అర్హత వున్న కాలేజీల్లో ఇంజనీరింగ్ పీజీ కోర్సుల ప్రారంభానికి అనుమతినివ్వనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.
రంగారెడ్డి జిల్లాలోవిజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీ భవనసముదాయం ప్రారంభోత్స కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఇంజనీరింగ్ కాలేజీల్లో పరిశ్రమలు కూడా భాగస్వామ్యంస్వీకరించాలని ఆయన అన్నారు. దీనివల్ల విద్యార్ధులకు ప్రాక్టికల్ శిక్షణకు అవకాశం వుంటుందని ఆయన చెప్పారు. మరోఅయిదేళ్లలో రాష్ట్రంలో సంపూర్ణ అక్షరాస్యతను సాధించనున్నట్టుగా ఆయన వెల్లడించారు.