ఎన్‌డిఎ పక్షాల్లో గుజరాత్ చిచ్చు
న్యూఢిల్లీ: గుజరాత్ పరిణామాలు ఢిల్లీ రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. గుజరాత్‌లో కొనసాగుతున్న హింసాకాండ జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) భాగస్వామ్య పక్షాల్లో చిచ్చు రేపుతోంది.
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడిని బర్తరఫ్ చేసి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని లోక్‌జనశక్తి డిమాండ్ చేసింది. గుజరాత్‌లో హింసకాండ కొనసాగుతుండడం పట్ల ఆ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది.
అయితే, ఈ పార్టీల డిమాండ్‌ను భారతీయ జనతా పార్టీ (బిజెపి) త్రోసిపుచ్చుతోంది. గుజరాత్‌విషయంలో భాగస్వామ్య పక్షాలు ఎన్‌డిఎ సమావేశంలో మాట్లాడాలని బిజెపి నేత సునీల్ శాస్త్రి అన్నారు. తనను ఎన్‌డిఎలో ఏకాకిని చేశారని తృణమూల్ కాంగ్రెస్ నేత మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యను బిజెపి త్రోసిపుచ్చింది. మమత అలా భావించాల్సిన అవసరం లేదని సునీల్ శాస్త్రి అన్నారు. ఏదైనా చెప్పదలుచుకుంటే మమతా బెనర్జీ ఎన్‌డిఎ సమావేశంలో చెప్పవచ్చునని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
