హైదరాబాద్: కాంగ్రెస్ నాయకులు తెలంగాణలో రాయలసీమ సంస్కృతిని ప్రవేశ పెడుతున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడువిమర్శించారు. వరంగల్ జిల్లా నాయకులతో ఆయన మంగళవారం ఈ మాటన్నారు.
రాయలసీమలోని హత్యా రాజకీయాల సంస్కృతిని తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు ప్రవేశపెడుతున్నారని ఆయన అన్నారు. వరంగల్ జిల్లాలో తెలుగు యువత నాయకుడు ప్రతాప రెడ్డి హత్య కేసులో దోషులను కఠినంగా శిక్షిస్తామని ఆయన హామీ ఇచ్చారు. తెలుగుదేశం నాయకులను, కార్యకర్తలను పార్టీ పరంగా ఆదుకుంటామని ఆయన చెప్పారు. తెలుగుదేశంవారిని తమ పార్టీలో చేరాలని అడగడం లేదా పని చేయవద్దని చెప్పడం, పని చేస్తే చంపేస్తామనడం వంటి చర్యలకు కాంగ్రెస్‌వారు పాల్పడుతున్నారని ఆయన అన్నారు.