న్యూఢిల్లీః గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడిని తప్పించడంలో మొండివైఖరి అవలంబిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వంపైఅవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని రిపబ్లికన్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు ఆర్.ఎస్.గావై శనివారం అభిప్రాయప్డడారు.
ఎన్డీఏలో ప్రధాన భాగస్వామ్య పార్టీలైన సమతా, తృణమూల్, సమతా పార్టీలు మోడిని మార్చాలని కోరుతున్నప్పటికీ బీజెపి మొండివైఖరి అవలంబిస్తున్నదని ఆయన అన్నారు. ఈ తరుణంలో వాజ్‌పేయి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశాన్ని ప్రతిపక్షాలు వదులుకోవని ఆయన అన్నారు.