హైదరాబాద్: గుజరాత్ పరిణామాలు, బిజెపికి మద్దతు ఉపసంహరణ, తదితరవిషయాల్లో తొందరపాటు తగదని, సంయమనంతో వ్యవహరించాలని బిజెపి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిని కోరింది.
తెలుగుదేశం తీసుకునే నిర్ణయం ఏదైనా తుదకు కాంగ్రెస్‌కు లాభం చేకూర్చిపెట్టేది కాకూడదని బిజెపి నేత, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఆయన ఆదివారం సాయంత్రం చంద్రబాబునాయుడితో ఫోన్‌లో మాట్లాడారు. నరేంద్ర మోడిని ఏ పరిస్థితుల్లో కొనసాగించాల్సి వస్తోందో కూడా ఆయన చంద్రబాబుకువివరించారు. ఉభయులకు ఉన్న రాజకీయ అనివార్యతల దృష్ట్యా మధ్యే మార్గం అనుసరించాలని ఆయన చంద్రబాబుకు సూచించారు. మద్దతు ఉపసంహరణ నిర్ణయంతీసుకుంటే ఉభయులకు నష్టం వాటిల్లుతుందని దత్తాత్రేయ అన్నారు.