గుజరాత్‌లో కొనసాగుతున్న హింస
అహ్మదాబాద్: అహ్మదాబాద్‌లో పోలీసు కాల్పుల్లో మరణించినవారి సంఖ్య ఐదుకుపెరిగింది. రామోల్ ప్రాంతంలో పోలీసు కాల్పుల్లో గాయపడిన వ్యక్తి మరణించాడు. అల్లర్లకు దిగిన మూకలను చెదరగొట్టడానికి పోలీసులు మంగళవారం రాత్రిషాపూర్, కలుపూర్, మిల్లత్‌నగర్, మనినగర్ ప్రాంతాల్లో పోలీసులు టియర్ గ్యాస్‌షెల్స్ వదిలారు; కాల్పులు జరిపారు.
ఇదిలా వుండగా, దరియాపూర్‌లో బుధవారంనాడు పగటి పూట కొద్దిసేపు కర్ఫ్యూ సడలించారు. దనిలిందాలో నాలుగు గంటల పాటు కర్ఫ్యూ సడలించారు. రాత్రి పూట కర్ఫ్యూ అమలులో వుంటుంది.విరంగామ్ టవున్‌లో మంగళవారంనాడు కత్తిపోటు సంఘటన చోటు చేసుకుంది. దీంతో అహ్మదాబాద్ రూరల్ జిల్లాలో కర్ఫ్యూ విధించారు.












Click it and Unblock the Notifications
