మైనారిటీ విద్యార్థులపరీక్షల బహిష్కరణ
అహ్మదాబాద్: గుజరాత్‌లో గురువారం ప్రారంభమైన రెండో విడత సెకండరీ, హయ్యర్ సెకండరీ పరీక్షలను దాదాపు 90 శాతం మంది మైనారిటీవిద్యార్థులు బహిష్కరించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని గుజరాత్ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పరీక్షలు నిర్వహిస్తోంది.
అహ్మదాబాద్, బరోడాలతో పాటు తొమ్మిది నగరాల్లో జరుగుతున్న ఈ పరీక్షలకు లక్షా 90 వేల మందివిద్యార్థులు హాజరవుతున్నారు.
పరీక్షా కేంద్రాల వద్ద ప్రభుత్వం వీడియో కెమెరాలను అమర్చింది. మైనారిటీవిద్యార్థులను సురక్షితంగా పరీక్షా కేంద్రాలకు చేరవేయడానికి కట్టుదిట్టమైన భద్రతతో బస్సులను ఏర్పాటు చేసింది.
ఎటువంటి ఉద్రిక్తతలకు లోనుకాకుండా పరీక్షలకుహాజరు కావాలని ముఖ్యమంత్రి నరేంద్ర మోడివిద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. పరీక్షలను చెడగొట్టాలని ప్రయత్నం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
