లక్ష్మణ్ క్లాస్‌ప్లేయర్: గంగూలీ
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: హైదరాబాద్ బ్యాట్స్‌మన్ వి.వి.యస్. లక్ష్మణ్‌ను భారత క్రికెట్ జట్టు కెప్టెన్ సౌరబ్ గంగూలీ క్లాస్ ప్లేయర్‌గా అభివర్ణించారు. లక్ష్మణ్‌ను విమర్శించేవారు అతను క్లాస్ ప్లేయర్ అనే విషయం గుర్తించాలని ఆయన సోమవారం విలేకరులతో అన్నారు.
వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో లక్ష్మణ్ వరుసగా మూడుఅర్థ సెంచరీలు చేశాడు. తొలి టెస్టులో లక్ష్మణ్ 69 పరుగులు చేశాడు. రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 69 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆదివారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 60 పరుగులు చేసి ఇంకా క్రీజ్ వద్ద ఉన్నాడు.
లక్ష్మణ్ ఇంకా జాగ్రత్తగా బ్యాటింగ్ చేయాల్సి వున్నదని గంగూలీ అభిప్రాయపడ్డాడు. చివరలో బ్యాటింగ్ చేయడం అంత సులభమైనవిషయం కాదని ఆయన అన్నాడు.












Click it and Unblock the Notifications
