చంద్రబాబుకు వాజ్‌పేయి ఫోన్
న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ నాలుగు సూత్రాల డిమాండ్‌ను వాజ్‌పేయి ప్రభుత్వం ముందుపెట్టింది. గుజరాత్ పరిణామాలపై అభిశంసన తీర్మానంపై లోక్‌సభలో మంగళవారం చర్చలో పాల్గొంటూ- గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడిని తప్పించాలని, ప్రస్తుత తరుణంలో రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించవద్దని తెలుగుదేశం డిమాండ్ చేసింది.
గుజరాత్ పరిణామాలు జాతిపై మాయని మచ్చలని ఆయన అన్నారు. మతంపేరుతో అనూహ్యమైన నేరాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. తాము ప్రజాస్వామ్య, లౌకిక సూత్రాలకు కట్టుబడి వున్నామని, గుజరాత్ పరిణామాలపై ఉమ్మడి ఆత్మ పరిశీలనను తమ పార్టీ కోరుకుంటోందని ఎర్రంనాయుడు చెప్పారు.












Click it and Unblock the Notifications
