తెలుగుదేశం మాతోనే వుంది: వాజ్‌పేయి
న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ)తోనే ఉన్నదని ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి అన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేత, విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఒమర్ అబ్దుల్లా రాజీనామాను ఇంత వరకు ఆమోదించలేదని ఆయన చెప్పారు. మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటయిన కార్యక్రమంలో ఆయన బుధవారం ప్రసంగించారు.
గాంధీయ గుజరాత్‌ను కొన్ని శక్తులు గాడ్సే గుజరాత్‌గా మారుస్తున్నాయని ప్రతిపక్ష నేత సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యపై ప్రధాని తీవ్రంగా విరుచుకుపడ్డారు. సున్నితమైన గుజరాత్‌అంశంపై జాతీయ ఏకాభిప్రాయం సాధించే తీరు ఇది కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications