న్యూఢిల్లీః గాంధీజీ గుజరాత్ గాడ్సేల గుజరాత్‌గా మారుతున్నదంటూ కాంగ్రెస్ నేత సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని వాజ్‌పేయి తీవ్రంగా విరుచుకుపడ్డారు. గుజరాత్ వ్యవహారాలను సోనియా పూర్తిగా వక్రీకరిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.
గుజరాత్‌లో శాంతి భద్రతల పునరుద్ధరణకు పూర్తిగా సహకరిస్తామని పార్లమెంట్‌లో ప్రకటించిన 24 గంటల్లోనే సోనియా రెచ్చగొట్టేవిధంగా మాట్లాడారని ఆయనవిమర్శించారు. పార్లమెంట్‌లో మాట్లాడిని దానికి పూర్తివిరుద్దంగా సోనియా గుజరాత్‌లో మాట్లాడారని ఆయనపేర్కొన్నారు. గుజరాత్‌లో కాంగ్రెస్ నిర్వహించిన శాంతి ర్యాలీలో పాల్గొన్న సోనియాగాంధీ ఎన్‌డిఎ సర్కారుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.