హైదరాబాద్‌ః
లోక్
సభస్పీకర్
పదవికి
తెలుగుదేశం
పార్టీ
అభ్యర్థిని
బరిలోకి
దించేవిషయంపై
పొలిట్
బ్యూరోలో
చర్చించి
ఒక
నిర్ణయం
తీసుకుంటామని
చంద్రబాబు
ప్రకటించారు.
ఈ
నెల
10న
లోక్
సభస్పీకర్
ఎన్నిక
జరపాలని
వాజ్
పేయి
పట్టుదలతో
వున్నందున
ఇంతకాలం
నాన్చివేత
ధోరణి
అవలంబిస్తున్న
తెలుగుదేశంస్పీకర్
పదవికి
పార్టీ
అభ్యర్థిని
బరిలోకి
దించాలా
లేక
వదులుకోవాలా
అనేవిషయాన్ని
తేల్చుకోవాల్సిన
పరిస్థితి
ఏర్పడింది.
వివిధ
కారణాల
వల్ల
గత
రెండు
నెలలుగాస్పీకర్
అభ్యర్థిని
ఎంపిక
చేసే
విషయంలో
తెలుగుదేశం
పార్టీ
తాత్సారం
చేస్తున్నది.
ఒకదశలోస్పీకర్
పదవిని
వదులుకోవాలని
కూడా
చంద్రబాబు
భావించారు.
గుజరాత్
పరిణమాల
దృష్ట్యా
తెలుగుదేశం
-
బిజెపి
సంబంధాలలోపెను
మార్పులు
సంభవించాయి.
ఈ
పరిస్థితుల్లోస్పీకర్
వదవిని
వదులుకొనేందుకే
చంద్రబాబు
మొగ్గుచూపుతారని
భావిస్తున్నారు.
శనివారం
పొలిట్
బ్యూరోలో
చర్చించిస్పీకర్
పదవికి
అభ్యర్థిని
నిలబెట్టాలా
లేదా
అనేవిషయంపై
ఒక
నిర్ణయం
తీసుకుంటామని
చంద్రబాబు
శుక్రవారంవిలేకర్లకు
చెప్పారు.
బిజెపి
సొంత
అభ్యర్థులపేర్లను
పరిశీలిస్తున్న
విషయాన్ని
విలేకర్లు
ప్రస్తావించగా
దానిపై
వ్యాఖ్యానించేందుకు
చంద్రబాబు
నిరాకరించారు