జమ్మూ తీవ్రవాద దాడి నీచం: వాజ్‌పేయి
న్యూఢిల్లీ: జమ్మూ సమీపంలోనిసైనిక శిబిరంపై దాడి సంఘటన అత్యంత నీచమైందని, ఇటువంటి సంఘటనలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నదని ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి అన్నారు. మిలిటెంట్లు జమ్మూ సమీపంలోని జాతీయ రహదారిపై 39 మందిని హత్య చేసిన సంఘటనపై ఆయన బుధవారం లోక్‌సభలో తీవ్రంగా ప్రతిస్పందించారు.
ఈ సంఘటనపై చర్చకు ప్రతిపక్షాల నేతలతో సమావేశం ఏర్పాటు చేస్తానని,అందువల్ల సభ్యులు ప్రశ్నోత్తరాల సమయాన్ని వృధా చేయవద్దని ఆయన చెప్పారు.
ఈ సంఘటనపై మంగళవారం హోం మంత్రి ఎల్.కె. అద్వానీ ఒక ప్రకటన చేశారని, రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ పరిస్థితినిఅంచనా వేయడానికి జమ్మూలో పర్యటిస్తున్నారని, ఫెర్నాండెజ్ గురువారం తిరిగి వస్తారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
