విజయవాడ జన్మభూమిసభలో లాఠీఛార్జి
విజయవాడః రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న 17వ విడత జన్మభూమి రెండోరోజు నిరసనలు, ఫిర్యాదుల పరంపరలు, లాఠీచార్జీలతో ముగిసింది.విజయవాడలో జన్మభూమి సభ ఉద్రిక్తతలకు దారితీసింది. గత జన్మభూమి సభల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయారంటూ సిపిఎం నేతలు అధికారులను నిలదీశారు. తెలుగుదేశం కార్యకర్తలు రంగప్రవేశం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆగ్రహించిన వామపక్ష కార్యకర్తలు పోలీసులపై రాళ్ళు రువ్వారు. దీంతో పోలీసులు లాఠీచార్జీ జరిపారు. పలువురు వామపక్ష నేతలనుఅరెస్టు చేశారు.
నెల్లూరు జిల్లాలో కూడా పలుచోట్ల జన్మభూమి సభలు ఉద్రిక్తంగా మారాయి. నీటి సమస్యను ఎత్తిచూపుతూ వందలాది మహిళలు ఖాళీ బిందెలతో ప్రదర్శనలు నిర్వహించారు. చిత్తూరు జిల్లాలో స్థానిక సమస్యలపై ప్రజల నుంచి వందలాది ఫిర్యాదులుఅందాయి.












Click it and Unblock the Notifications
