ముషార్రఫ్ హామీ నచ్చింది: ఆర్మిటేజ్
ఇస్లామాబాద్: భారత్‌తో యుద్ధాన్ని నివారించడానికి తాను కట్టుబడిఉన్నట్లు పాకిస్థాన్ అధ్యక్షుడుపర్వేజ్ ముషార్రఫ్ హామీ ఇచ్చినట్లు అమెరికా విదేశాంగ సహాయ మంత్రి రిజర్డ్ ఆర్మిటేజ్ చెప్పారు. భారత ఉపఖండం పర్యటనలో భాగంగా ఆయన గురువారం ఇస్లామాబాద్ చేరుకున్నారు.
ఆర్మిటేజ్ ఇస్లామాబాద్‌లో పాకిస్థాన్ అధ్యక్షుడుపర్వేజ్ ముషార్రఫ్‌తోనూ, విదేశీ వ్యవహారాల మంత్రి అబ్దుల్ సత్తార్‌తోనూ సమావేశమయ్యారు. ఆర్మిటేజ్ పర్యటన ముగించుకుని వెళ్లిన తర్వాత రక్షణ మంత్రి డోనాల్డ్ రమ్స్‌ఫీల్డ్ భారత ఉపఖండంలో పర్యటిస్తారు.
ఇస్లామిక్ మిలిటెంట్లు నియంత్రణ రేఖ వెంబడి భారత కాశ్మీర్‌లోకి చొరబడడం లేదని ముషార్రఫ్ తనకు చెప్పినట్లు ఆర్మిటేజ్ తెలిపారు.












Click it and Unblock the Notifications
