సేనల ఉపసంహరణ లేదు: ఫెర్నాండెజ్
బెంగుళూర్: పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదానికిస్వస్తి చెప్పి, 14 మంది ఉగ్రవాదులను భారత్‌కుఅప్పగించే వరకు సేనల మోహరింపును ఉపసంహరించే ప్రసక్తి లేదని రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ చెప్పారు.
ఈ రెండు డిమాండ్ల కోసం భారత్ ఎంత కాలం నిరీక్షిస్తుందని అడిగితే నిరీక్షణ ఎంత కాలం అవసరమైతే అంత కాలమని, నిర్ణీత గడువేది ఇవ్వలేమని ఆయన జవాబిచ్చారు. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రవాద శిబిరాలను మూసేయాలని పాకిస్థాన్ ఆదేశించినట్లు వచ్చిన వార్తలను ప్రస్తావించగా సీమాంతర ఉగ్రవాదంవిషయంలో, చొరబాట్లను ప్రోత్సహించే విషయంలో పాకిస్థాన్ ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు రాలేదని తమకు సమాచారం ఉన్నదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
