• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భారత్‌కు రమ్స్‌ఫెల్డ్‌ ప్రశంస

By Staff
|

న్యూఢిల్లీః అమెరికా రక్షణ శాఖ మంత్రి రమ్స్‌ ఫీల్డ్‌ బుధవారం నాడు భారత రక్షమ శాఖ మంత్రి జార్జి ఫెర్నాండెజ్‌ ను కలుసుకున్నారు. భారత్‌ పాకిస్తాన్‌ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపధ్యంలో రమ్స్‌ ఫీల్డ్‌ న్యూఢిల్లీ పర్యటనకు వచ్చారు. గురువారం ఆయన ఇస్లామాబాద్‌ లో కూడా పర్యటిస్తారు. పాకిస్తాన్‌ కు త్వరలో భారత్‌ హై కమిషనర్‌ ను పంపే విషయంపై ఆయన ఫెర్నాండెజ్‌ తో చర్చలు జరిపినట్లు భావిస్తున్నారు. ఉద్రిక్తతల నివారణకు భారత్‌ తీసుకున్న చర్యల పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

రమ్స్‌ఫీల్డ్‌ బుధవారం సాయంత్రం ప్రధాని వాజ్‌ పేయితో ఆయన చర్చలు జరుపుతారు. అంతకు ముందు రమ్స్‌ఫీల్డ్‌ అమెరికా నుంచి వస్తూ విమానంలో విలేకర్లతో మాట్లాడారు. అంతర్జాతీయ తీవ్రవాది లాడెన్‌ జాడకోసం ముమ్మరంగాగాలిస్తున్నట్లు ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X