ప్రధాని ప్రకటనపై ఫరూఖ్ నిప్పులు
శ్రీనగర్: ఎన్నికలుస్వేచ్ఛగా, నిజాయితీగా జరగడానికి అవసరమైతే జమ్మూ కాశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తామని ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి లక్నోలో చేసిన ప్రకటన పట్ల ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వారికి మా మీద నమ్మకం లేదా? బిజెపి పాలన ఉన్న గుజరాత్‌విషయంలో అదే చర్య ఎందుకు తీసుకోరు అని ఆగ్రహంగా అడిగారు. ఏమైనా మీడియా ప్రధాని నోటి మాటగా ప్రచారం చేస్తోందని, మీడియా ప్రతినిధులు కుచ్చి కుచ్చి ప్రశ్నలు అడుగుతారని, ప్రధాని అతి సాధారణంగా వ్యాఖ్యానించి వుంటారని, మీడియా దానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
