వార్ పద్ధతి మారాలి: దేవేందర్
వరంగల్:పీపుల్స్‌వార్‌తో చర్చలు జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని, చర్చలపై నక్సలైట్లకే చిత్తశుద్ధి లేదని హోం మంత్రి టి. దేవేందర్ గౌడ్ అన్నారు. వరంగల్ జిల్లా మహబూబాబాద్ డివిజన్‌లోని నర్సింహులపేటలో ఆయన సోమవారం పోలీసుస్టేషన్ భవనాన్ని ప్రారంభించారు.
చర్చల సందర్భంగా పీపుల్స్‌వార్ ప్రజా సమస్యలను ముందుకు తెస్తే ప్రభుత్వం పరిష్కరిస్తుందని దేవేందర్ చెప్పారు. ఈ నెల 20వ తేదీనపీపుల్స్‌వార్ చర్చలకు వస్తే అందుకు ప్రభుత్వం సిద్ధంగానే ఉన్నదని ఆయన అన్నారు. వరవరరావు, గద్దర్ కోరితే వారికి గన్‌మెన్‌ను
ఇస్తామని ఆయన చెప్పారు. చర్చల ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ చర్చల గురించి,పీపుల్స్‌వార్ గురించి పోలీసులు పదే పదే ప్రకటనలు చేయడాన్ని మంత్రి సమర్థించారు. సంఘవిద్రోహ శక్తుల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత పోలీసులకు ఉంటుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
