పంచాయతీల వల్ల కక్షలు: చిలకం
హైదరాబాద్: తగాదాల పరిష్కారానికి న్యాయ పంచాయతీలు ఏర్పాటు చేస్తే గ్రామాల్లో కక్షలుపెరుగుతాయని భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్రాధ్యక్షుడు చిలకం రామచంద్రా రెడ్డి అభిప్రాయపడ్డారు.
వచ్చే శాసనసభ వర్షాకాలం సమావేశాల్లో రాష్ట్రంలోని కరువు పరిస్థితిని లేవనెత్తుతామని భారతీయ జనతా పార్టీ శాసనసభా పక్ష నాయకుడు ఎన్. ఇంద్రసేనారెడ్డి మరోవిలేకరుల సమావేశంలో చెప్పారు. వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రత్యామ్నాయ పంటలు వేయడానికి రైతులకు విత్తనాలు, సమాచారంఅందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయనవిమర్శించారు. స్కాలర్‌షిప్‌ల కుంభకోణాన్ని, భూమి పంపకం సమస్యను శాసనసభ సమావేశాల్లో ప్రస్తావించనున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications
