వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్థికాభివృద్ధిపై వాజ్‌పేయివిశ్వాసం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పదవ పంచవర్ష ప్రణాళికా కాలంలో దేశం ఎనిమిది శాతం ఆర్థికపెరుగుదలను సాధించగలదని ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి విశ్వాసం వ్యక్తం చేశారు. గత రెండు దశాబ్దాల్లో వేగంగా ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న ఆరు దేశాల్లో భారత్‌ ఒకటని ఆయన చెప్పారు.

ఆయన శనివారం ఆర్థిక సలహా మండలి సమావేశంలో ప్రసంగిచారు. ఆర్థికాభివృద్ధికి ఎనిమిది కీలక రంగాలున్నాయని ఆయన చెప్పారు.పెరుగుదల వ్యూహం ఉపాధి అవకాశాలను పెంచేదిగా, ఆర్థిక సంస్కరణలను వేగవంతం చేసేదిగా వుండాలని, దాని వల్ల భారత్‌ స్పష్టమైన మార్కెట్‌ ఎకానమీగా మారుతుందని ఆయన అన్నారు.

మార్కెట్‌ నియంత్రణ సమర్థ, స్వేచ్ఛాయుత నియంత్రణ సంస్థల ద్వారా జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. పర్యావరణ పరిరక్షణపేరుతో అభివృద్ధికి ఆటంకంగా మారిన సమస్యలన్నిటినీ తొలగించాల్సిన అవసరం ఉన్నదని, పర్యావరణానికిదెబ్బ తగలకుండానే వాటిని తొలగించవచ్చునని ప్రధాని అన్నారు. జిడిపిని 8 శాతానికి, ఆ పైబడి పెంచడానికే ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన చెప్పారు. హామీలకు, అమలుకు మధ్య ఉన్న అంతరాన్ని రూపుమాపడానికి తమ ప్రభుత్వం కట్టుబడి వున్నదని ఆయన చెప్పారు. నియంత్రణ ప్రక్రియను సమూలంగా మార్పు చేయడానికి సమగ్ర చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X