పలకరింతలు... చతురోక్తులు
హైదరాబాద్‌ః ఎప్పుడూ పరస్పరం విమర్శించుకొనే చంద్రబాబు - వైఎస్ కరచాలనాలు, హాస్యోక్తులు, రాజకీయ మంత్రాంగంతో సీరియస్ గా వుండే వివిధ పార్టీల నేతల ముఖాల్లో నవ్వులు, మంత్రుల చతురోక్తులు..... ఇవీ సోమవారం ఉదయం జూబ్లీ హాలులో కనిపించిన దృశ్యాలు. శాసనసభ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు ఆనవాయితీగా స్పీకర్ ప్రతిభా భారతి వివిధ పార్టీల నేతలకు విందు ఇచ్చారు.
చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి వస్తునే ముందు వరసలో వున్న వివిధ పార్టీల ఎమ్మెల్ల్యేలతో కరచాలనం చేశారు. కమలనాధులు కాషాయం రంగు కండువాలు ధరించగా, సిపిఎం నేత నోముల నర్సింహయ్య ఏకంగా ఎర్రచొక్కా ధరించి సమావేశానికిహాజరయ్యారు. ఇదిలా వుండగా నక్సలైట్ల కార్యకలాపాలు అధికం కావడం, ఐఎస్‌ఐ కదలికలు వుండండంతో ఈ సారిఅసెంబ్లీ సమావేశాలకు అసాధారణ రీతిలో భద్రతా ఏర్పాట్లు చేశారు.












Click it and Unblock the Notifications
