హైదరాబాద్‌ః ప్రభుత్వం-నక్సలైట్ల మధ్య కొనసాగుతున్న చర్చల వ్యవహారాన్నిఅసెంబ్లీలో ప్రస్తావించాలని సిఎల్‌పి నిర్ణయించింది.
ఈ నెల 20వ తేదీన రెండు వర్గాల మధ్య తుది చర్చలు జరుగుతున్న కారణంగా ఆలోగా శాసనసభలో ఈఅంశాన్ని లేవనెత్తి ప్రభుత్వం తన వైఖరిని తేటతెల్లం చేసేలా ఒత్తిడి చేయాలని సిఎల్‌పి నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. మంగలవారం నుంచి పదిరోజుల పాటు జరిగేఅసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వంపై దాడికి వ్యూహాన్ని ఖరారు చేసేందుకు వైఎస్ సారథ్యంలో సిఎల్‌పి సమావేశమైంది. పనికి ఆహారం పథకంలో భారీ ఎత్తున చోటుచేసుకున్న అవినీతి, బూటకపు ఎన్‌కౌంటర్లు, ఈ సంవత్సరం నిర్వహించిన వివిధ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై ప్రభుత్వాన్ని నిలదీయాలన్ని సిఎల్‌పి నిర్ణయించింది.విద్యుత్ చార్జీలు, కోత అంశంపై ప్రభుత్వం దుమ్ముదులుపాలని నిర్ణయించింది.