న్యూఢిల్లీః పోటా కిందఅరెస్టయిన ఎండిఎంకె నాయకుడు వై.గో.కు ఎన్టీఏ బాసటగా నిలిచింది. తమిళనాడులోని జయలలిత ప్రభుత్వం పోటా చట్టాన్ని దుర్వినియోగం చేసిదని ఆదివారం రాత్రి జరిగిన ఎన్డీఏ సమావేశం అభిప్రాయపడింది.
వైగో అనుభవాన్ని దృష్టిలో వుంచుకొని పోటావిషయంలో మరిన్న జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్డీఏ భావించింది. వై.గోఅరెస్టు జరిగి నాలుగురోజులైంది. ఇన్ని రోజులు నోరుమెదపని ఎన్డీఏ ఆయనను గట్టిగా సమర్థించడంతో పాటు జయను తప్పుపట్టడం గమనార్హం.