వాజ్ పేయి కొలువులో చేరనున్న మమత
న్యూఢిల్లీః తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ వాజ్‌పేయి క్యాబినెట్ లో చేరే అవకాశాలు మెరుగైనాయి. తూర్పురైల్వే విభజనపై తన సహజశైలిలో కేంద్రంతో కయ్యానికి కాలుదువ్విన మమత కేంద్ర క్యాబినెట్ లో చేరేందుకు తొలుత ససేమిరా అన్నారు.పైగా రైల్వే మంత్రిత్వ శాఖ ఇవ్వకపోతే కేంద్ర మంత్రిపదవి నాకుఅక్కరలేదని కరాఖండిగా చెప్పారు. ఈ లోగా తూర్పురైల్వే విభజన్ వ్యవహారం రావడంతో కేంద్రంపై కత్తి దూశారు. అయితే ఎన్టీఏ కన్వీనర్ జార్జి ఫెర్నాండెజ్ ఆమెకు నచ్చచెప్పడంతో ఆమె దారికివచ్చినట్లు భావిస్తున్నారు. ఆమె అలక మానిందనడానికి ఆదివారం సాయంత్రం జరిగిన ఎన్డీఏ సమావేశానికి మమతహాజరు కావడమే నిదర్శనం అని చెబుతున్నారు.
కేంద్ర నిర్ణయం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర క్యాబినెట్ లో చేరతారాఅ ప్రశ్నకు ఆమె సమాధానం దాటవేశారు.












Click it and Unblock the Notifications
